14-11-2025 07:26:15 PM
ములకలపల్లి, (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పై కాంగ్రెస్ మండల నాయకుడు సురభి రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న రెహమత్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రచారంలో పాట పాడుతూ చేసిన ప్రచారంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషించే విధంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి ఘన విజయం సాధించి కొత్త ఒరవడి ప్రారంభించిందని తెలిపారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపు ఉత్సాహం తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.