14-11-2025 07:21:36 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ బీసీ రిజర్వేషన్ల బిల్లుల అమల్లో జరుగుచున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ, వేములవాడ పట్టణంలోని బీసీ సాధికారిత సంఘం కార్యాలయం ముందున రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ అర్.కృష్ణయ్య పిలుపు మేరకు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిభా పులే గార్లకు ముందుగా పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, ఉదయం 10.00 గంటల నుండి 2.00 గంటల వరకు బీసీల దర్మపోరాట దీక్షలను చేపట్టారు.
దర్మపోరాట దీక్షల్లో పాల్గొన్న బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కొండ దేవయ్య మాట్లాడుతూ... తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా అమలు చేయాలని, రిజర్వేషన్లు అమలయ్యకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ పర రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరపాలన్న ఆలోచన విరమించుకోవాలని, కోర్టుల్లో న్యాయపోరాటం, కేంద్రంలో రాజకీయ పోరాటం చేసి రిజర్వేషన్లను చట్టబద్ధంగా సాధించాలని కొండ దేవయ్య అన్నారు.ఉభయసభల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన,విద్య, ఉపాధి , ఉద్యోగాలల్లో రిజర్వేషన్లకు చెందిన రెండు బీసీ బిల్లులు బిల్ నెంబర్ 3 బిల్ నెంబర్ 4 లను మార్చీ 27 న అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లులు సుమారు 8 మాసాలు గడుస్తున్నపటికి బిల్లులు ఆమోదించక పెండింగ్లో ఉంచడం చాల బాధాకరమని దేవయ్య అన్నారు.
పొలాస నరేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, డిసెంబర్ 1 న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో, రాష్ట్రానికి చెందిన ఇరుపార్టీల జాతీయ ఎంపీలు 16 మంది, ఇతర రాజ్యసభ సభ్యులు ఉభయసభల్లో ప్రశ్నించాలని, ఉభయ సభలను స్తంభింపజేయాలని,అవసరమైతే బీసీ జేఏసీ నేతలతో,అఖిలపక్షంతో ఢిల్లీని దిగ్బందించైన రిజర్వేషన్లను సాధించాలని నరేందర్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.బీసీ రిజర్వేషన్ల పోరాటం ఏ వర్గానికి, ఏ పార్టీలకు, ఏ మతానికి వ్యతిరేకం కాదని,జనాభా దామాషా ప్రకారం బీసీ హక్కులకై,బీసీల వాటా - కోటా కొరకు,బీసీల ఆత్మ గౌరవం కొరకు చేస్తున్న పోరాటమని,రిజర్వేషన్లు సాధించేంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలా జయశంకర్ సార్ స్ఫూర్తితో ఉద్యమము కొనసాగిస్తూనే ఉంటామనీ నరేందర్ అన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకై నేడు చేపట్టిన బీసీల దర్మపోరాట దీక్షల్లో బీసీ సంఘాల నేతలు, జేఏసి నేతలు అఖిలపక్షం నేతలు తుపుకారి సత్తయ్య, ఇల్లందుల వెంకటేష్,రంగు రామాగౌడ్,నేరెళ్ళ అనిల్ గౌడ్,కూరగాయల మల్లేశం,కూరగాయల కొమురయ్య,మారం కుమార్,కొండ కనుకయ్య,లింగంపల్లి దేవయ్య,నేరెళ్ల నర్సయ్య,వాసం మల్లేష్ యాదవ్,ఉయ్యాల భూమయ్య గౌడ్,కనపర్తి సుధాకర్,జాప ప్రసంగి, చేను హేలపతి,బుర్ర దశ గౌడ్,ముద్రాకోల నర్సయ్య,గణేష్,నగేష్, లింబాద్రీ,మ్యాణ రాజేష్,శ్రీధర్,కుంభం రవీందర్,కనపర్తి హన్మాన్డ్లు,ఒన్నారపు దేవయ్య,దండ్ల జంపయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.