11 March, 2026 | 11:04 AM

మురుగు కాలువల శుభ్రం

11-03-2026 12:00 AM

ములకలపల్లి, మార్చి 10 (విజయక్రాంతి): మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మూకమామిడి గ్రామపంచాయతీలో రహదారులను మురుగు కాలువలను శుభ్రపరిచారు. మురుగు కాలువలలో దోమలు పెరగకుండా ఉండేందుకు డీజిల్టింగ్ బ్లీచింగ్,లైమ్ ను చల్లారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని రహదారులు శుభ్రపరచాలని డ్రైనేజీలలో ఉన్న మురుగును బయటికి తీయాలని డ్రైనేజీలకు, మురికినీటి కాలువలకు బ్లీచింగ్ లైమ్ చల్లాలని సిబ్బందికి సూచించారు.గ్రామాలలో రహదారులు అన్ని శుభ్రపరచాలని సిబ్బందికి తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కేసుపాక శ్రీనివాసరావు ఉప సర్పంచ్ కురుసం సీత,వార్డు మెంబర్ కొడిమే ముత్తయ్య, అంగన్వాడి కార్యకర్త సున్నం మహలక్ష్మి,వివో తోట అరుణకుమారి,ఆశావర్కర్ కోడిమే వనిత,సున్నం లక్ష్మి, గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది కొండ్రం శ్రీను,గడ్డం వెంకటేష్, కుంజా నగేష్ సున్నం శ్రీను,బత్తుల వెంకటేష్ కాక నగేష్,నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.