28 June, 2026 | 3:56 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలి

11-03-2026 12:00 AM

డ్రైన్ పూడిక తీసిన మేయర్

పాల్వంచ, మార్చి 10, (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించి పరిష్కరించాలని కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 35,40,44,47 డివిజన్లలో డిప్యుటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పోరేటర్లు వీశంశెట్టి విశ్వేశ్వరరావు, అడుసుమిల్లి సాయిబాబా, నామా కీర్తి, గుర్రం వెంకటేశ్వర్లుతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

44వ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, గాంధీనగర్ ప్రాంతాలతో పాటు 35వ డివిజన్లోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ, జ్యోతినగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైన్ వ్యవస్థను పరిశీలించడంతో పాటు స్వయంగా డ్రైవ్ పూడికను తీశారు. అదేవిధంగా మేడికుంట చెరువును కూడా పరిశీలించారు.

44, 39 డివిజన్ల మధ్యలో ఉన్న పెద్ద డ్రైనేజీ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన ప్రజలు కాలువలు దాటుతూ నడవాల్సిన పరిస్థితి ఉందని గమనించిన అయన వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచి ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు తెలపడంతో సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఆయనకు పాలువాలు కప్పి పూల దండలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్, వీశంశెట్టి పూర్ణ చంద్రరావు, అన్నవరపు వెంకటేశ్వర్లు, వీశంశెట్టి పద్మజ, గొర్ల నరేష్, కొమ్మవరపు ఆదామ్, నవీన్, నామా పండు, యాకయ్య, గౌతమి కృష్ణ, కిన్నెర శ్రీను, ఆగరెడ్డి వెంకట్రెడ్డి, గూడపాటి నర్సింహారావు, నారపోగు రామయ్య, వెంకన్న, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.