2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఎమ్మెల్యే జీఎంఆర్‌కు సీఎం పరామర్శ

16-09-2024 04:04 AM

దేవరకద్ర: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)ని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మరణించడంతో దశదిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హైద్రాబాద్ నుంచి నేరుగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు.  ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. 

కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.