calender_icon.png 11 February, 2026 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

11-02-2026 02:48:24 AM

మేడ్చల్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్టలో శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుఠతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వాహణాధికారి కట్ట సుధాకర్రెడ్డి కలిసి ముఖ్యమంత్రిని సన్మానించి,ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు సీఎంకు వివరించారు.