calender_icon.png 11 February, 2026 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

11-02-2026 02:47:07 AM

హోరాహోరీగా సాగిన వాలీబాల్, బాక్సింగ్ సమరం

ఎల్బీనగర్ (సరూర్ నగర్), ఫిబ్రవరి 10: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్202526 రంగారెడ్డి జిల్లా స్థాయి పోటీలు మంగళవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చి వాలీబాల్ మరియు బాక్సింగ్ విభాగాలలో తమ ప్రతిభను చాటారు.

పోటీలలో క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా వాలీబాల్ విభాగంలో కల్వకుర్తి జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. వాలీబాల్ (బాలురు)కల్వకుర్తి నియోజకవర్గ జట్టు విజేతగా నిలవగా, షాద్నగర్ జట్టు రన్నరప్గా నిలిచింది. వాలీబాల్ (బాలికలు)కల్వకుర్తి నియోజకవర్గ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, ఇబ్రహీంపట్నం జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన లీగల్ & ఎస్టేట్ ఆఫీసర్ (SATG) శ్రీమతి పద్మావతి, డీవైఎస్‌ఓ శ్రీ ఈ. వెంకటేశ్వర్ రావు, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తాయని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిపాదనపరిచిన క్రీడాకారులు త్వరలోనే రాష్ట్రస్థాయి క్రీడలో పాడనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శులు శ్రీ రవి కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రతినిధి శ్రీ రాఘవ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీ రామచంద్రుడు, శ్రీ షబీర్, శ్రీ మల్లేష్లతో పాటు జిల్లా కోచ్లు, ఫిజికల్ డైరెక్టర్లు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.