ఇక మూసీపై ముందడుగే.. తగ్గేదే లేదు: సీఎం రేవంత్
29-10-2024 04:02 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టుపై ఇక ముందుడుగే.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు సీఎం విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. మూసీ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆరోచిస్తామని, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నవంబర్ 1వ తేదీన బాపూఘాట్ నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. నవంబర్ లోపు మూసీ పునరుజ్జీవం పనులకు టెండర్లు పిలుస్తామని, మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.




