ఆ రాష్ట్రాలు వృద్ధుల పాలిట శాపంగా మారాయి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్లతో చేపట్టిన వైద్య ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డ్రోన్ సేవలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఆయుర్వేదం.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని, 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వృద్ధులు స్వాభిమానంతో జీవించాలనే ఉచిత వైద్యచికిత్స అందించేందుకే బీజేపీ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. బెంగాల్, ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ సేవలు అందించడం లేదని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల వైఖరి మృద్ధులకు శాపంగా మారిందని, జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం రాయితీతో ఔషధాలు లభ్యం అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఉచిత డదయాలసిస్ కేంద్రాల ద్వారా రోగులకు అండగా ఉన్నామని, గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.




