ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ
13-02-2026 05:38 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలిపారు.
కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ అంతటా మెజారిటీ మునిసిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నేరేడుచర్ల, హుజూర్‌నగర్, హాలియా, కోదాడ్, నందికొండ, చండూరు, చిట్యాల్, భూత్పూర్, ధర్మపురి, భీమ్‌గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, ఎస్.జంగారెడ్డి, ఆందోలు, రామాయంపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్‌పూర్, మధిర, అశ్వారావుపేట, యెల్లందు, ములుగు, యాదగిరిగుట్ట, ఆలేరు.




