calender_icon.png 13 February, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 లక్షల టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

13-02-2026 01:04:44 AM

  1. యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి
  2. బాయిల్ రైస్‌లో 5% నూకకు అనుమతించండి
  3. 2014- బకాయిలు రూ. 1,468.94 కోట్లు విడుదల చేయండి
  4. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతి

ఢిల్లీ, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025- సీజన్) సంబంధించి తాము అదనంగా  సేకరించిన 18 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరస రఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం కలిశారు.

వానాకాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్‌ఎంటీ) అనుమతించారని.. కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎల్‌ఎంటీలు తా ము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శా తం నూకతో ఎఫ్‌సీఐ సేకరించాలని కేంద్రమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. 2024 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ ట న్నుల బాయిల్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కేంద్రమంత్రి జోషిని వారు కోరారు.

2024 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సీఐకి 2014 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబం ధించి తెలంగాణకు బకాయిపెట్టిన రూ. 1,468.94 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని..

దానికి వడ్డీ రూ. 2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మ ల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.