ఎంఎల్ఎ సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
22-06-2024 08:26 PM
హైదరాబాద్ : ఎంఎల్ఎ మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంపల్లిలోని ఎంఎల్ఎ సత్యం ఇంటికి వెళ్లిన సీఎం ఎంఎల్ఎ సతీమణి రూపాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంఎల్ఎకు దైర్యం చెప్పి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంఎల్ఎ సత్యం భార్య రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో గురువారం రాత్రి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
గత కొంతకాలంగా ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నారు. రుపాదేవి చికిత్స తీసుకుంటున్నప్పటికి నొప్పి తగ్గపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్ లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.






