1 August, 2026 | 8:57 PM

కేంద్ర ప్రభుత్వ పన్ను విధానం.. రాష్ట్రాలకు తగ్గిన ఆదాయం

22-06-2024 07:49 PM

న్యూఢిల్లీ :  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ సన్నాహాక సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు సమావేశాల్లో రాష్ట్రానికి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సలహాలు, సూచనలు చెప్పామన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై పున:సమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలనియువతకు ఉపాధి అవకాశాలు పెంచే స్కిల్ డెవలప్ మెంట్ పై దృష్టి సారించాలని  కోరినట్లు చెప్పారు. దేశంలో ప్రజల మధ్య ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని,  కేంద్ర ప్రభుత్వ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు సర్ ఛార్జీలు, సెస్ ల ఆదాయం తగ్గిందన్నారు. సర్ ఛార్జీలు, సెస్ లు 10 శాతానికి మించకూడదని సూచనలు చేసినట్లు వెల్లడించారు.