1 August, 2026 | 6:56 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

22-06-2024 09:28 PM

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బోనాల పండుగలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న బోనాల ఏర్పాట్లపై  సమీక్షించారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. బోనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ప్రధాన ఆలయాలకు 3 రోజుల్లో బోనాల ఉత్సవ కమిటీలను నిర్వహిస్తారు. జోగినీలు బోనాలు సమర్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రతిష్ఠ ప్రతిబింబించేలా బోనాలు నిర్వహించాలన్నారు.