3 September, 2026 | 6:01 PM

మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు సంతోషంగా ఉన్నారా : కొండా సురేఖ

03-09-2026 | 04:55pm

హైదరాబాద్: నా మాజీ ఓఎస్డీ సుమంత్ పై కక్ష కట్టి ఇబ్బంది పెట్టారని, నాపై చర్యకు సిఫారసు చేసిన మల్లు రవి కూడా గతంలో కాంగ్రెస్ ను తిట్టినవారే అని కొండా సురేఖ పేర్కొన్నారు. గతంలో రోశయ్య, జైపాల్ రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారని, నన్ను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నేనేమి బాధపడట్లేదన్నారు. మేం ప్రజాబలం ఉన్న నాయకులం, జనం మావెంటే ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు సంతోషంగా ఉన్నారా..? అని అడిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలూ బయటకు వచ్చి మీ బాధలు చెప్పుకోండని, ప్రజాప్రతినిధులకే పనలు జరగని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. 

ఇవి కూడా చదవండి: 

నన్ను తొలగించడం అధిష్ఠానానికి ఇష్టం లేదు: కొండా సురేఖ

బర్తరఫ్ పై కొండా సురేఖ స్పందన

కేబినెట్‌ నుంచి “కొండా సురేఖ బర్తరఫ్”

కొండా సురేఖ మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు వైరల్