పుట్టిన బిడ్డ చేతికి బంగారు ఉంగరం
నవజాత శిశువులకు గోల్డ్ రింగ్.. సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్!
మదురై: పుట్టిన ప్రతి బిడ్డకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ బంగారు కానుక.. తమిళనాడు ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(CM Vijay) సోమవారం మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో ‘థాయ్‌మామన్ థంగా మోతిరం తిట్టం’ (Thaaimaman Thanga Mothiram Thittam)ను ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన నవజాత శిశువులకు ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందించనున్నారు.
ఇవి కూడా చదవండి: సుప్రీంకోర్టు కన్నెర్ర
పథకం ప్రారంభోత్సవంలో సీఎం విజయ్ స్వయంగా కొంతమంది శిశువులను ఎత్తుకుని వారికి బంగారు ఉంగరాలను(Tamil Nadu Gold Ring Scheme) అందించారు. తొలి దశలో సుమారు 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌ను కేటాయించి, ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పథకం కేవలం బంగారు ఉంగరం ఇవ్వడానికే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ ప్రయోజనం జూన్ 22, 2026 నుంచి జన్మించిన శిశువులకు వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకానికి తమిళనాడు ప్రభుత్వం(CM Vijay Gold Ring Scheme) ఏడాదికి రూ.755.83 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసింది. పూర్తి స్థాయిలో సంవత్సరానికి సుమారు 4.41 లక్షల ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ‘థాయ్‌మామన్’ అంటే మేనమామ అనే తమిళ సంప్రదాయ భావనకు అనుగుణంగా ఈ పథకానికి పేరు పెట్టారు. నవజాత శిశువును కుటుంబంలోకి ఆహ్వానించే సందర్భంలో బంగారు కానుక అందించడం ద్వారా ఈ సంప్రదాయ భావనను సంక్షేమ పథకంతో అనుసంధానించారు