19 May, 2026 | 1:45 AM

పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు

19-05-2026 12:00 AM

పలువురిని అరెస్టు చేసిన పోలీసులు

సుల్తానాబాద్, మే 18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న ముఠాపై సోమవారం సుల్తానాబాద్ సీఐ రంజిత్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. కోడిపందాలు ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కారు, 6 ద్విచక్ర వాహనాలు, 40 వేల నగదు, 6 కోళ్లు స్వాధీనపరచుకున్నట్లు తెలిసింది.