చిరుత దాడిలో మూడు దూడలు హతం
19-05-2026 12:00 AM
కామారెడ్డి జిల్లా -సామ దుబ్బ తండాలో ఘటన
తాడ్వాయి, మే 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని సామ దుబ్బ తండాలో ఆదివారం రాత్రి చిరుత పులి దాడిలో మూ డు లేగ దూడలు హతమయ్యాయి. తండాకు చెందిన రమావత్ రమేష్ లేగ దూడలను తండా పక్కనే ఉన్న తన పశువుల పాకలో కట్టివేసి ఉంచాడు. రాత్రి సమయంలో లేగ దూడలపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. రెండు దూడలపై దాడి చేసి అక్కడే హతమార్చగా, మరో దూడను దూరంగా తీసుకువెళ్లి హతమార్చింది. ఈ దాడిలో రూ.50 వేల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.






