12-02-2026 01:31:19 AM
వచ్చే వారంలో వర్షలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేర్కొంది. ఉత్తర భారతంలో పశ్చిమ అలజడుల ప్రభావం వల్ల హిమాలయ ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని, ఈశాన్య, వాయువ్య, దక్షిణ తీర ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఫిబ్రవరి 13, 16, 17 తేదీల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే వీలుందని, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 16, 17 తేదీల్లో వర్షంతో కూడిన హిమపాతం సంభవించవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఫిబ్రవరి 12, 14 తేదీల్లో తేలికపాటి జల్లులు పడుతాయని, దీనివల్ల ఈటానగర్, తవాంగ్ వంటి నగరాల్లో పొడి వాతావరణం నుంచి ఉపశమనం కలుగనుందని తెలిపింది.