calender_icon.png 12 February, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ నుంచి స్పష్టత లేదు!

12-02-2026 01:30:10 AM

  1. చమురు కొనుగోలుపై ట్రంప్ మాటలే వింటున్నాం
  2. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్

మాస్కో, ఫిబ్రవరి 11: ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేమని భారత్ తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బుధవారం ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. తమ దేశం నుంచి భారత్ చమురు కొంటుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. అత్యంత ఖరీదైన సహజ వాయువును భారత్ వంటి దేశాలకు విక్రయించేందుకు ఎత్తులు వేస్తున్నదని ఆరోపించారు.

తమ దేశంతో భారత్‌కు బలమైన సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని, గతేడాది డిసెంబర్‌లో తమ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనతో ఆ బంధం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు. త్వరలో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో మళ్లీ ఇరు దేశాధినేతలు భేటీ అవుతారని స్పష్టం చేశారు.