31 July, 2026 | 1:16 PM

సింగీతం ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల

31-07-2026 12:28 PM

నిజాంసాగర్ జూలై 31( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్  మండలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన  సింగీతం రిజర్వాయర్ ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి 663 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏ ఈ సాకేత్ తెలిపారు. సింగీతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని అలుగు పొంగడంతో నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.