5 June, 2026 | 7:49 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా కలెక్టర్ అంకిత్

05-06-2026 06:36 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో, శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ వి.కే.సి.ఏం ప్రాంతంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి కృష్ణ గౌడ్ తదితరులు కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.