13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీ.పీ సమీక్ష

27-06-2025 12:34 AM

నిజామాబాద్, జూన్ 26 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29 కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు అవుతుండడంతో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు  సూచించారు.  భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీ.పీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.