10 April, 2026 | 1:44 AM

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలును తనిఖీ చేసిన కలెక్టర్

10-04-2026 12:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కూకట్ పల్లి లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ (బాలురు) స్కూల్ , జూనియర్ కాలేజీ ని కలెక్టర్ మను చౌదరి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేసారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతి రోజు సమయానికి  పౌష్టిక  ఆహారాన్ని   అందించాలని, వసతి గృహంలో అందుతున్న బోధన పై ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు మీకు ఇష్టమైన స్పోరట్స్, గేమ్స్, మీ అభిరుచులలో కూడా మీ ప్రతిభను బయటపెట్టి అందులో కూడా మీరు రాణించేలా  మీకు అవసరమైన శిక్షణను అందించడానికి  ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. చదువుతో పాటు మారుతున్న టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకొని ఎక్కువ శ్రమ పడకుండా స్మార్ట్ వర్క్ చేయాలని తద్వారా టైమ్ సేవ్ అవుతుందన్నారు.

ప్రస్తుతం చాట్ జిపిటి, జెమిని, పెర్ప్లెక్సిటి వంటి ఎఐ టూల్స్ ఎక్కువగా వినియోగించడం జరుగుతుందన్నారు. ఎఐ టూల్స్ ద్వారా పెయింటింగ్, వెబ్ డిజైనింగ్, ప్రొగ్రామింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకోండి, అవి మీ భవిష్యత్తు ప్రయత్నాలలో ఎల్లప్పుడూ తోడ్పడతాయని, ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలని, సబ్జెక్ట్ అంటే కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ అంశం పై పూర్తి అవగాహాన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి తహాసీల్దార్ స్వామి, ప్రిన్సిపల్ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.