కౌకుంట్ల గ్రామంలో బెల్ట్‌షాపుల నిషేధం
అమ్మితే రూ.లక్ష
కొంటే రూ.50వేలు జరిమానా
పట్టిస్తే రూ.10వేల నజరానా
చేవెళ్ళ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): చేవెళ్ల మండల పలిదిలోని కౌకుంట్ల గ్రామంలో మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, సెక్రెటరీ సునీత అధ్యక్షతన బెల్ట్ షాపుల సమగ్ర నిర్ములనకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం లభించడం వల్లన ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
మద్యం తాగి చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంచేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంగించి మద్యం అమ్మిన వారిపై రూ. 1లక్ష జరిమాన విధిస్తామన్నారు.
అలాగే కొన్న వారికి సైతం రూ.50వేల జరిమాన విదిస్తే పట్టించిన వారికీ రూ.10,000 పారితోషకం ఇస్తామని గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు. ఈ నిర్ణయం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు మహిళా సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




