22 August, 2026 | 8:20 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

జాతీయస్థాయిలో రాణించాలి: కలెక్టర్ వెంకటేష్ దోత్రే

28-11-2024 12:03 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయస్థాయి క్రీడాలో రాణించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికవడంతో ఆయన ఎనిమిది మంది విద్యార్థినిలు (సత్యభామ, కవిత, నందిని, అనుష, శిరీష, అంజలి, పల్లవి, అలేఖ్య)లను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్రస్థాయి పోటీల్లో మడి జిల్లా తరఫున పాల్గొని జాతీయస్థాయిలో అందించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరగబోయే 46వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీన రెడ్డి తెలిపారు. ఈ కార్య్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, ఏటీడీవో చిరంజీవి, ఏసీఎంవో ఉద్ధవ్, జి సి డి ఓ శకుంతల,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు, కోచ్ లు అరవింద్ విద్యాసాగర్, తిరుమల్, వార్డెన్ సాయిబాబా,ఉపాధ్యాయ బృందం పాల్గొని ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.