ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం
22-08-2026 08:10 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన భూక్య మోహన్‌రావును కృష్ణసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తాటి వాణి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్‌రావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎం. నాగిరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






