22 August, 2026 | 7:47 PM

అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా

22-08-2026 07:13 PM

ముకరంపుర,(విజయక్రాంతి): మే 2026లో నిర్వహించిన కేంబ్రిడ్జ్ ప్రైమరీ చెక్‌పాయింట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జ్యోతినగర్, కరీంనగర్ ఎక్స్‌ప్లోరికా ప్రీమియం స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యార్థులు ఇంగ్లీష్, గణితం, సైన్స్ విభాగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌ప్లోరికా విద్యార్థులు సాధించిన స్థానాలు సైన్స్ – 30వ స్థానం, గణితం – 32వ స్థానం,ఇంగ్లీష్ – 32వ స్థానం మూడు విభాగాల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషంగా భావిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డా. ఈ. ప్రసాద్ రావు విద్యార్థులను ఘనంగా సత్కరించి, వారి అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా కేంబ్రిడ్జ్ నుంచి అందిన ధృవపత్రాలను వారికి అందజేశారు. పాఠశాల డైరెక్టర్లు రష్మిత, అనుకర్ రావు, ప్రసూన, వి.యు.ఎం. ప్రసాద్, రాకేష్, ప్రాచి, వినోద్ రావు, ప్రిన్సిపాల్ శర్మిష్ఠ విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల, ప్రతిభను ప్రశంసించారు.విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ఎక్స్‌ప్లోరికా ప్రీమియం స్కూల్ లక్ష్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.