నిరుద్యోగుల సమస్యలపై పోరాటం
05-10-2024 01:06 AM
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 4 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అల్కాపురికాలనీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది మంది పట్టభద్రులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 1.97 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేయించుకున్నారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోవద్దని అన్నారు.






