07-02-2026 08:40:07 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ లో బాగంగా శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో 11న జరిగబోయే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సిద్ధం చేసిన పోలింగ్ సామాగ్రిని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేసి పరిశీలించారు. డివిజన్ల వారిగా11 పోలింగ్ కోసం సిద్దం చేసిన సామాగ్రిని పరిశీలించి... అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సామాగ్రి ఏర్పాటు పై అధికారులకు పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు.