10 July, 2026 | 3:43 AM

మేడ్చల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

08-07-2024 02:49 AM

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

మేడిపల్లి, జూలై 7: మౌలిక సదుపాయల కల్పన, అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పీర్జాదిగూడ ఆదర్శంగా నిలిచిందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీసాయినగర్ కాలనీలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మేయర్ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధితో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అధ్యక్షులు బండారి రవీందర్, రఘువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, బచ్చరాజు, మద్ది యుగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.