3 August, 2026 | 2:10 AM

అహ్మదాబాద్‌లో కలుద్దాం

03-08-2026 01:36 AM

గ్లాస్గోకు గుడ్‌బై

ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్

శతాబ్ది ఉత్సవాలకు భారత్ ఆతిథ్యం

గ్లాస్గో గేమ్స్‌కు తెరపడింది. 74 దేశాలకు చెందిన 3 వేల మందికి పైగా అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఉత్సాహంగా సాగిన ముగింపు వేడుకల్లో భార త్‌కు కామన్‌వెల్త్ బ్యాటన్‌ను అందించారు. వచ్చే కామన్‌వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. 2023 నాటికి కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభమై వందేళ్లు పూర్తి కానుండడంతో శతాబ్ది ఉత్సవాలకు భార త్ వేదిక కానుంది.

గ్లాస్గో, ఆగస్టు 2 : ఎంతో వైభవంగా సాగి న 2026 కామన్‌వెల్త్ గేమ్స్ ఘనంగా ముగిసాయి. ముగింపు వేడుకలు అంగరంగవైభ వంగా జరిగాయి. తక్కువ క్రీడాంశాలతో, తక్కువ బడ్జెట్‌తో  11 రోజులుగా జరిగిన ఈ క్రీడాసంబరంలో 74 దేశాలకు చెందిన అథ్లె ట్లు పాల్గొన్నారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది.

కాగా 2030లో కామన్‌వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం అయ్యి 2030 నాటికి వందేళ్లు పూర్తి అవుతాయి. దీంతో భారత్ కామన్‌వెల్త్ శతాబ్ది ఉత్సవాలకు భారత్ వేదిక కానుంది. మన దేశంలో రెండోసారి ఈ క్రీడలు జరగనున్నాయి. 2010లో ఢిల్లీ వేదికగా భారత్ మొదటి సారి కామన్‌వెల్త్ గేమ్స్  నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ 2030లో కామన్‌వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనుంది.

2036 ఒలింపిక్స్ కోసం తన బిడ్‌ను బలోపేతం చేయడానికి ఈకామన్‌వెల్త్ గేమ్స్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. 2010 కామన్‌వెల్త్ క్రీడలను ఢిల్లీలో నిర్వహించినప్పుడు ప్రారంభంలో 16,000 కోట్ల ను నిర్వహణ వ్యయంగా అంచనా వేశారు. కానీ, క్రీడలు ముగిసే సమయానికి ఖర్చు 70,000 కోట్లకు చేరుకుంది. అయితే 2030లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడలకు 3 వేల నుంచి 5 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశముందని అంచనా. అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్ గేమ్స్ లో పోటీపడే క్రీడాంశాలను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.