29 July, 2026 | 11:34 AM

సావుబతుకుల్లో లావు సదువులు!

29-05-2024 02:19 AM

మెడికల్ కాలేజీల్లో మరణమృదంగం

నిజామాబాద్ కళాశాలలో ఆత్మహత్యల కలకలం

గత ఏడాది ఇద్దరు బలవన్మరణం, ఒకరు ఆత్మహత్యాయత్నం

ఈ ఏడాది ఓ జూనియర్ ఆత్మహత్యా ప్రయత్నం

మానసిక ఒత్తిడీ కారణమంటున్న మానసిక వైద్యనిపుణులు

మనుషులను చావు నుంచి తప్పించే చదువులు వారివి. కానీ, వారే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కారణాలు ఏవైనా కాబోయే డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  రోగులకు వాడాల్సిన నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఏడాది కాలంలోనే ఇద్దరు మెడికోలు బలవన్మరణం పొందగా, మరొకరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం వైద్య విదార్థులను కలవరానికి గురిచేస్తోంది. 

నిజామాబాద్, మే 28 (విజయక్రాంతి ప్రతినిధి) : నిజామాబాద్ మెడికల్ కళాశాలలో మానసిక, ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిళ్లు మెడికోలను ఆత్మన్యూనతలోకి నెట్టివేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఏడాది కాలంలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకోగా, రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మెడికోలకు కౌన్సిలింగ్ నిర్వహించగా, సమస్య తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించినా, ఇటీవల మరో మహిళ జూనియర్ డాక్టర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. నిరుడు ఇద్దరు మెడికోలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

25 ఫిబ్రవరి 2023న ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి శ్రీహర్ష(24), మూడో అంతస్తులో ఉన్న తన హాస్టల్ గదిలో ఉరేసుకుంది. ఎంబీబీఎస్ కోర్సు త్వరలోనే పూర్తవుతుందని, కొద్దికాలంలోనే తనకు డాక్టర్ పట్టా అందుకోబోతున్నానని తల్లికి ఫోన్ చేసిన శ్రీహర్ష, రెండు ౩రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. మరో ఘటనలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన మోసం సనత్ (22) మార్చ్ 31  2023న తన హాస్టల్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. 

ఈ రెండు ఘటనల్లో విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక సమస్యలు కాని, కుటుంబ సమస్యలు కాని లేవు. మధ్యతరగతి కుటుంబాలైన తమ కుమారుల్ని జీవితంలో మెరుగైన స్థానంలో నిపాలని ఆశించిన తల్లిదండ్రులకు కుమారుల ఆత్మహత్యలు అశనిపాతంగా మరాయి. వీటితో పాటు 17 జూలై 2023న నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్ విద్యార్థిని, ఒత్తిడి, తోటి విద్యార్థులతో జరిగిన గొడవలతో నిద్రమాత్రలు మిం గి ఆత్మహత్యకు యత్నించింది. ఐతే తోటి విద్యార్థులు ఆమెను గమనించి ఆసుపత్రిలో చేర్చడంతో బతికి బట్టకట్టింది. ఈ సంఘటనలు మరువక ముందే ఇటీవల మరో జూనియర్ డాక్టర్ తోటి విద్యార్థులతో గొడవపడి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నిం చింది. ఐతే తోటి విద్యార్థులు గమనించి ఆమెకు వైద్యసహాయం అందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. 

మానసిక ఒత్తిడే కారణమా?

విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనవ్వడం, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు, పైనల్ ఇయర్‌లో (ఇంటర్న్‌షిప్‌లో) ఉన్న విద్యార్థులపై పనిఒత్తిడిలాంటి సమస్యలు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడేటట్టు ప్రేరేపిస్తున్నాయని, కొన్నిసార్లు కుటుంబ సమస్యలు సైతం ఒత్తిడికి గురిచేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. గతంలో మెడికల్ విద్యార్థులకు ఇప్పటి మెడికల్ విద్యార్థులకు అనేక తేడాలున్నాయని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ అంటున్నారు. తాము మెడిసిన్ చదివే సమయంలో మానవ సంబంధాలు ఎక్కువగా ఉండేవని, స్నేహితులు, తోటివారితో ఎక్కువగా గడిపేవార మని, ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవారమని చెప్తున్నారు.

ఇప్పటి మెడికల్ విద్యార్థులు ఎక్కువగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆన్‌లైన్ గేమ్స్, సినిమాల లాంటివాటిపై సమయం గడుపుతున్నారని చెప్పారు. వీరిపై తల్లిదండ్రులు, బంధువులు ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం, లాంటివి ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపారు.  దానికి తోడు ఒత్తిడిని ఎలా తట్టుకోవడం, డిప్రెషన్, యాంగ్జుటై లాంటిపై అవగాహన లేకపోవడం మెడికల్ విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. సరైన సెలవులు లేకపోవడం, రెండో సంవత్సరం నుంచి క్లినికల్ సర్వీసులు ప్రారంభమవ్వడం, ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సిరావడంతో ఒత్తిడి పెరుగుతుందన్నారు. 

ఆటలపై దృష్టిపెట్టండి

మెడికోలలో ఒత్తడి నివారణకు ఆటలపై దృష్టిపెట్టాలని, స్మార్ట్ ఫోన్ కల్చర్‌కు, ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని జగి త్యాల మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, మా నసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ సూచిస్తున్నారు. విద్యార్థులలో ఒత్తడి నివారణకు అధ్యాపకులతో కూడిన కమిటీలు ఎర్పాటు చేశామని, తరచు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామని, ని జామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర అంటున్నారు. మానసిక నిపుణుల సూచనలు సలహాలతో మెడికల్ విద్యార్థుల్లో ఆత్మ హత్యల ఆలోచనలను నియంత్రించవచ్చని అంటున్నారు.