29 July, 2026 | 12:24 PM

ఇక్కడ అంతా సప‘రేటు’

29-05-2024 02:17 AM

ప్రైవేటు వక్తుల చేతుల్లో అనుమతుల వ్యవహారం

పాలమూరులో లైసెన్స్ సర్వేయర్లు, మధ్యవర్తులదే హవా

స్థలం యజమాని పత్రాలు, అదనపు డబ్బులు చెల్లిస్తే చాలు 

క్షణాల్లో ఇంటి అనుమతులు, రోజుల్లో నిర్మాణాలు పూర్తి 

ఇదీ మహబూబ్‌నగర్‌లో నిత్యం జరుగుతున్న అవినీతి

మహబూబ్‌నగర్, మే 28 (విజయక్రాంతి) : స్థలం ఉంది.. ఇల్లు కుట్టుకుంటాం.. అనుమతులు ఇవ్వండి అంటే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో కుదరదు. దానికో పద్ధ తి.. సప‘రేటు’ వ్యక్తులు ఉంటారు. వారిని కలి స్తే క్షణాల్లో అనుమతులు వస్తాయి. ఆ తర్వా త కథ వేరే. ఇదీ ఇక్కడ సాగుతున్న వ్యవహారం. ఈ పట్టణంలో నూతనంగా ఇల్లు కట్టుకోవాలంటే నేరుగా ముందు ప్లానర్‌ను కలవాలి. ఆ తర్వాత వారు చెప్పిన వ్యక్తులను సంప్రదించాలి. మీ స్థలం పత్రాలు వారికి అందిస్తే చాలు.. మీరు మున్సిపల్ ఆఫీసుకు ఎంత రుసుము కట్టాలో లెక్కలు వేసి.. దాని కి అదనంగా రూ.5 వేల నుంచి రూ.10 వేలు కలిపి చెబుతారు. ఆ అదనం డబ్బు చెల్లించనిదే ఇంటి పర్మిషన్ రాదు.. వీరిని కాదని నేరుగా ఇంటి యజమాని కలిసినా ఆఫీసు లో నోరు విప్పేవారు ఉండరు.. ఇదీ మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఎదురయ్యే అనుభవాలు. చివరకు చేసేదేమీ వాళ్లు అడిగిన సొమ్ము ఇచ్చేసి ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

మధ్యవర్తులదే హవా!

ఈ వ్యవహారంలో లైసెన్స్ సర్వేయర్లు, మధ్యవర్తులదే హవా నడుస్తున్నట్లు పట్టణం లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇల్లు కట్టాలనుకునే వారు ఎవరైనా ముందుగా వీరిని కలిసి.. వారు చెప్పిన పద్ధతిని ఫాలో అయితే చకచకా అనుమతులు, ఆపై ఇంటి నిర్మాణాలు ముందుకు సాగుతాయని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇందుకు మున్సిపల్ అధికారులు, మధ్య దళారులు కుమ్మక్కై మూకుమ్మడిగా ఈ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. స్థలాన్ని బట్టి రూ.5వేల నుంచి పైనే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ముడుపులే ముందు !

ఇంటి పర్మిషన్ కోసం మున్సిపాలిటీ పన్ను రూపంలో చెల్లించే రుసుము కంటే ముందుగానే వారికిచ్చే రూ.5వేలో లేదా రూ.10వేలో ముందుగానే దళారులకు ముట్టజెప్పాలి. ఆ తర్వాతే అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు. లేదంటే స్థలానికి సంబంధించిన వివరాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. ఒక పదేళ్ల కిందటి రికార్డులు కావాలనో, ఇంకా మరేదైనా సాకులు చెప్పి వినియోగదారులను తిప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బాధలు వద్దనుకుని వేరే విధిలేక.. అందరూ దళారీ దారుల్లోనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు పొందుతున్నట్లు తెలుస్తోంది.  

డైరెక్ట్ అధికారులే..! 

ఒకవేళ ఎవరైనా నేరుగా ఆఫీసులోకి వెళ్లి.. వివరాలు అడగాలనుకున్నా.. బయట ఉన్న దళారుల ఆఫీసులను సంప్రదించాలని చెప్తుండటం గమనార్హం.  ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. జిల్లా ఉన్నతాధికా రులు మున్సిపల్ కార్యాలయంలో సాగుతున్న దళారీ వ్యవస్థపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ముడుపుల వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. 

ఇంటి నిర్మాణం అంటే మున్సిపాల్టి ప్రోత్సహించాలి

గత ప్రభుత్వాలకైనా...నేటి ప్రభుత్వాలకైనా ప్రతి ఒక్కరికీ ఇంటి నిర్మాణం కట్టించి ఇవ్వాలని సంకల్పంతో అడుగులు వేస్తున్నామని ప్రకటనలు చెబుతారు. ఈ ప్రకటనల వరకు బాగనే ఉన్న దశబ్దాల తరబడి ఈ ప్రకటనలు వస్తున్న ఇల్లు లేని వారందరికీ ఇంటి నిర్మాణం చేసి పేదలకు అందించే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వాలు విఫలం అవుతువస్తున్నాయి. కాగా ఇల్లులేని వారు తమ ఇంటి నిర్మాణంను వారే నిర్మించుకుంటామని చెప్పిన అధికారులు వారికి పూర్తిస్థాయిలో సహకరించడంలేదని అరోపనలు అధికమవుతున్నా యి. ఇంటి నిర్మాణంకు ఇలా ధరఖాస్తు చేయండి ఎవరీకి ఎలాంటి అధనపు డబ్బు లు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రచారం చేసి ప్రత్యేకంగా అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు నోరుమొదపడం లేదు. ఇంటి నిర్మాణాలు ఎంత మంది చేపడితే ప్రభుత్వానికి అంత ఆదాయం రావడంతోపాటు అధనపు బారం పడకుండ ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

నిబంధనల మేరకే అనుమతులు

ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అదనంగా ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు నేరుగా నిబంధనల మేరకు మున్సిపాలిటీలో దరఖాస్తులు చేసుకోవచ్చు.  అన్ని పత్రా లు సక్రమంగా ఉంటే వెంటనే అనుమతులు ఇస్తాం. సందేహాలు ఉంటే ము న్సిపల్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవచ్చు. వారి సూచనల మేర కు ఎవరైనా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

 - మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్