29 July, 2026 | 10:56 AM

ఇద్దరు బైక్ దొంగల పట్టివేత

29-05-2024 02:21 AM

21 వాహనాలు స్వాధీనం

కరీంనగర్, మే ౨౮(విజయక్రాంతి): బైక్ లు చోరీ చేసే ఇద్దరు నిందితులను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో  తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన గోనెల శంకర్ (36), బోయిని చంద్రబాబు (29) ను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి  21 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశామని కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో 15, ఎల్‌ఎండీ పరిధిలో -5, కరీంనగర్ టూ టౌన్ పరిధిలో 3, గన్నేరువరం పరిధిలో 1, కొమురవెల్లి పరిధిలో ఒక బైకు దొంగతనం చేసినట్టు వెల్లడించారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెకర్టర్ జే సరిలాల్ తెలిపారు.