ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్, మే 7 (విజయక్రాంతి): బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ సీపీ గురువారం వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్, ఐటీ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులతో పాటు, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులు, ప్రస్తుతం పెండింగ్ కేసుల రికార్డ్ లకు సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రతి గ్రామస్తుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ట్రాఫిక్ రూల్స్ పై అవగహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణా, పాఠశాలల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహారించాలని పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి తెలిపారు. ఈ తనిఖీల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీం శర్మ, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ నవీన్ కుమార్ వున్నారు.
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీపీ ..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం చిల్పూర్ లోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పోలీస్ కమిషనర్ కు తీర్ధ ప్రసాదాలు స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యత, ఆలయంలో జరిగే కార్యక్రమాల వివరాలను ఆలయ పూజారి పోలీస్ కమిషనర్ కు వివరించారు.






