17 March, 2026 | 3:42 AM

జనాభా గణనపై పూర్తి అవగాహన అవసరం

17-03-2026 01:09 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 16 (విజయ క్రాంతి):జిల్లాలో నిర్వహించనున్న ఇళ్ల గణన కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టేందుకు జనాభా గణన ఫార్మాట్లో ఉన్న ప్రతి అం శంపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం రెండవ రోజున కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్,  ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల గణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు ఫార్మాట్లోని ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఎదుర్కొనే సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జనాభా గణనను డిజిటలైజేషన్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో బిక్షపతి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా ఇవ్వాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత కోరారు.సోమవారం జిల్లా కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు.

ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు తమ తరఫున బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను అందించి సహకరించాలని కోరా రు. అలాగే మే నెలలో చేపట్టనున్న జాతీయ ఇళ్ల గణన కార్యక్రమానికి కూడా రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.