ఐక్యత తోనే అభివృద్ధి సాధ్యం
డాక్టర్ సామెల్
మహబూబ్ నగర్ : తమ హక్కుల సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దళిత కైరా క్రైస్తవులంతా ఏకతాటిపైకి రావాలని డాక్టర్ సామెల్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విజన్ గార్డెన్లో దళిత క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ప్రసాద్ యోనా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కరు హీనంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకతాటి పైకి వచ్చి సాధించుకునేంతవరకు ఉద్యమించాలన్నారు.
దళిత క్రైస్తవులపై నిత్యం దాడులు జరగడం బాధాకరమన్నారు. దాడులు జరిగే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని దళిత క్రైస్తవులకు అండగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల కోసం తమ ప్రభుత్వం అండగా ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ సమస్య ఉన్న వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు కృషి చేసుకుందామని ఆయన సూచించారు. ఈ విషయంలో తమ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పరంజ్యోతి సుందర్ పాల్, నాగరాజు లతోపాటు జేఏసీ నేతలు ఏసు, ఆడమ్స్ రాజు లతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన దళిత క్రైస్తవ నేతలు తదితరులు పాల్గొన్నారు






