సంక్షేమ వసతి గృహాలను పూర్తి చేయండి
- మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం
- ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచండి
- వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి
- ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాం తి): సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం పూర్తయిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తిచేసి రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమశాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించా రు.
తదుపరి వైద్య, ఆరోగ్య, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు వచ్చేలా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేసవిలో వసతి గృ హాల మరమ్మతులు పూర్తిచేయాలని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించ బోమని తెలిపారు.
సంక్షేమ వసతి గృహాల అద్దెలు, ఎలక్ట్రికల్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీ లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామని సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో ఆర్థిక శాఖకు బిల్లులు పంపాలని సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ బిల్లులు ఏడు నెలలకు ఒకసారి చెల్లించేవారని గుర్తుచేశారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చెక్ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పా టు చేసుకొని నిరంతరం సమీక్షించాలని సూచించారు.
డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామని, సంక్షేమ వసతి గృహాల బిల్లులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి చెల్లిస్తున్నామని, ఈ నేపథ్యంలో అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి బోధన, భోజనంలో నాణ్యత, సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు ఆయుష్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయా లని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్య లో మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలు అడవిని కాపాడుకుంటారని అటవీశాఖ అధికారులకు డిప్యూటీ సూచించారు. పర్యాటకరంగం విస్తరిస్తే స్థానిక ప్రజలకు ఉపాధితోపాటు ఆదా యం సమకూరుతుందని తెలిపారు. కాలు ష్య కారకాలు వాటిని నియంత్రించకపోతే వచ్చే ప్రమాదాలు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని దేవాదాయ శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సభ్య సాచి గోష్, కృష్ణ ఆదిత్య, క్రిస్టి నా, సువర్ణ, హనుమంతరావు పాల్గొన్నారు.




