31 March, 2026 | 1:30 PM

Breaking News

గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •   అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం   •   ఆమనగల్లులో ఘోరం.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది   •  

దుకాణాల కూల్చివేతపై ఆందోళన

27-09-2024 02:55 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26: వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద బుధవారం పోలీసుల పహారాలో జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్డు ను అక్రమించిన పండ్లు, పూల దుకాణాలను కూల్చివేశారు. దీంతో గురువారం చిరువ్యాపారులు ఆందోళన చేపట్టారు. రైతుబజార్ ఏర్పడినప్పటి నుంచి తాము ఇక్కడే వ్యాపారం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిరువ్యాపారులపై కక్ష కట్టి మా దుకాణాలను కూల్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేనిది ఇప్పుడే ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు మాకు సమయం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని.. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన సామగ్రి, వస్తువులు, సరుకులు తీసుకోకుండానే దుకాణాలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చడానికే రోడ్డును అక్రమించిన దుకాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.