29 June, 2026 | 6:01 PM

ప్రభుత్వం పేరు నిలపండి: ఆత్మ చైర్మన్

29-06-2026 05:30 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా ఉద్యోగులు సహకరించాలని బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ కోరారు. సోమవారం సోనాల మండలానికి నూతనంగా బదిలీపై వచ్చిన ఎంపీడీవో రత్నాకర్ ఆర్ఐ సునీతలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.