29 June, 2026 | 5:42 PM

చేనేత సంఘం మండల అధ్యక్షునిగా పర్వతం వేణుగోపాలరావు

29-06-2026 04:42 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల చేనేత సంఘ అధ్యక్షునిగా సఖినవీడుకు చెందిన పర్వతం వేణుగోపాలరావు, సంఘ వైస్ చైర్మన్‌గా ఆదయ్య, సెక్రటరీగా రావిలాల శ్రీను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నూతన కమిటీ చేనేత కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, చేనేత రంగ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ విమేలమ్మ, మాజీ వైస్ ఎంపీపీ రామ కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ల సంఘం ఎరుపాలెం మండల అధ్యక్షుడు యరమల విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవన్ కుమార్, నాలుగో వార్డు సభ్యుడు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, కుప్పాల లక్ష్మి తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.