మా నేతను గెలిపిస్తామని బీజేపీ కార్యకర్తలు ధీమా కల్పించాలి
29-06-2026 05:02 PM
హనుమకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్(BJP National President Nitin Navin) తెలంగాణలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఆయన మూడు పర్యటనలో భాగంగా సోమవారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం(BJP Booth Presidents Convention) నిర్వహించారు. బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా. లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... మా నేతను గెలిపిస్తామని బీజేపీ కార్యకర్తలు ధీమా కల్పించాలని, కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని పేర్కొన్నారు. కరీంనగర్ లో నన్ను ఓడించేందుకు అసదుద్దీన్ ఓవైసీ శతవిధాలా ప్రయత్నించారు.






