అటు పోలేరు.. ఇటు రాలేరు!
ఇజ్రాయెల్ - ఇరాక్ యుద్ధ ప్రభావం
ఎక్కడిక్కడే నిలిచిపోయిన విమానాలు
ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆందోళన
ప్రత్యేక సెల్ ఏర్పాటుకు మంత్రి అడ్లూరి హామీ
కరీంనగర్, మార్చి2(విజయక్రాంతి): పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యం త రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయాల పై దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
యుద్ధ ఉ ద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్లోని ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధి కారులు ప్రకటించారు. ఈ పరిణామంతో ఉ మ్మడి జిల్లాకు చెందిన వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా ప్ర యాణికులు ఎవరూ విమానాశ్రయాలకు రావొద్దని దుబాయ్ విమానయాన సంస్థలు అధికారికంగా విజ్ఞప్తి చేశాయి.ఉమ్మడి జిల్లా కు చెందిన వేలాది మంది దుబాయి. ఖాతార్ లలో స్థిరపడ్డారు.
ఇక్కడ వ్యాపారం గా స్థిరపడ్డవారు ఉన్నారు. నిత్యం తమమ ప్రాంతాలకి వచ్చి పోతుంటారు.దుబాయ్ కే వలం ఒక గమ్యస్థానమే కాకుండా ఇండి యా అమెరికా దేశాలను కలిపే అతిపెద్ద ’ట్రాన్సిట్ హబ్’. అంటే అమెరికా, యూరప్ మరియు ఆఫ్రికా దేశాలకు వెళ్లే వారు దు బాయ్ మీదుగానే ప్రయాణిస్తుంటారు. ఇ ప్పుడు దుబాయ్ విమానాశ్రయాలు మూతపడటంతో కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ రద్దయ్యా యి. దీనివల్ల వివిధ దేశాలకు వెళ్లాల్సిన ప్ర యాణికులు మధ్యలోనే నిలిచిపోయారు.
విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని అయోమయ స్థితిలో ప్ర యాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై కూడా దుబాయ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లే విమానాలు రద్దయ్యాయి. లు, ఉద్యోగ రీత్యా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గమనించిన శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ముంద స్తు హెచ్చరికలు జారీ చేశారు. అస్థిరమైన ఈ పరిస్థితుల్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం కాదని సూచించారు.
యుద్ధం కారణంగా ఇరాన్, ఇరాక్ మరియు ఇజ్రాయెల్ దేశాల గగనతలాన్ మూసివేయ డం వల్ల కొన్ని విమానయాన సంస్థలు సర్వీసులను పూర్తిగా నిలిపివేయగా, మరికొన్ని సంస్థలు షెడ్యూల్ను మార్చేశాయి. ఈ అకస్మాత్తు మార్పుల వల్ల ప్రయాణికులు ఇ బ్బందులు పడుతున్నారు. శని, ఆదివారా ల్లో ఎయిర్పోర్టుకు చేరుకున్నాక విమానం రద్దు వార్త తెలియడం వల్ల ఇబ్బందులు ప డ్డారు.విమానయాన సంస్థల వ్బుసైట్లు , కస్టమర్ కేర్ ద్వారా తమ ఫ్లైట్ రద్దయిందా లే దా సమయం మారిందా అన్నది ధృవీకరించుకుంటున్నారు.
ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దు. : మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్..
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న భారతీయులు అధైర్య పడవద్దు. జగిత్యాల జిల్లా నుండి ఉపాధి కోసం పలువురు ఇరాన్ దేశానికి వలస వెళ్లారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థి తిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుంది.
ఇరాన్ లో ఉన్న భారతీయుల యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ని కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇరాన్ లో ఉన్న జగిత్యాల జిల్లావాసులు సైతం వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, కు టుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. ఇరాన్ లో ఉన్న భారతీయులు ఎవరు ఆందోళన చెందబద్దు.




