calender_icon.png 10 February, 2026 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం

10-02-2026 07:54:08 PM

దోమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ కర్ణాటక పలు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా దేశ ఈ బీడీ కంపెనీ తోపాటు వివిధ అనుబంధ కంపెనీలను స్థాపించి లక్షలాదిమందికి కార్మికులకు సిబ్బందికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల ను ఆదుకుంటున్న దేశి బీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ పూణేలో మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ మండల కేంద్రంలో గల దేశ బీడీ కంపెనీ సెంటర్లో మంగళవారం సెంటర్ పరిధిలోని కమిషన్ దారులు ప్యాకింగ్ స్టాప్, చాటన్ కార్మికులు నితిన్ బాయ్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన నితిన్ సెట్ సేవలను కొనియాడారు. ఈ సంతాప కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ భావిక్ బాయ్ తో పాటు ఆఫీస్ సిబ్బంది కమిషన్ దారులు ప్యాకర్లు చాలా స్టాప్ కార్మికులు పాల్గొన్నారు.