calender_icon.png 10 February, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో ఇన్నో క్వేస్ట్ 4 హ్యాకథాన్ పోస్టర్ విడుదల

10-02-2026 07:50:43 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇన్నో క్వేస్ట్ 4 హ్యాకథాన్–2026కు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం విశ్వవిద్యాలయ అధికారులు ఆవిష్కరించారు. విడుదల చేసిన పోస్టర్ ద్వారా హ్యాకథాన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడo జరుగుతుందన్నారు.

ఈ హ్యాకథాన్ ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం పొందనున్నారు. పోస్టర్ విడుదల అనంతరం డీన్లు మాట్లాడుతూ డాక్టర్ వి. విజయ్ కుమార్  హ్యాకథాన్ లు విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యలకు పరిష్కారాలు రూపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు.

డాక్టర్ జి. విష్ణుమూర్తి మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమ నిర్వహణలో స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, కన్వీనర్ డాక్టర్ పి. రవీందర్ రావు, డాక్టర్  ఎస్. దీపిక, దుర్గభవానీ ప్రధాన పాత్ర పోషించారు. వారి మార్గదర్శకత్వంలో ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించబడింది.