15 July, 2026 | 4:20 AM

కండోమ్‌లే అస్త్రాలుగా..

25-12-2024 02:39 AM

1971లో పాక్‌ను మట్టికరిపించిన భారత సైన్యం  

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: యుద్ధం అనగా నే బాంబులు, తుపాకులు, యుద్ధ విమానా లు ట్యాంకర్‌లు గుర్తొస్తాయి. కానీ 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సందర్భంగా భారత సైన్యానికి సంబంధించిన ఓ తెలివైన ఎత్తుగడ గురించి చాలామందికి తెలిసి ఉండదు. ‘కాదేది కవిత్వానికి అనర్హం’ అని అన్నట్టుగా కాదేదీ యుద్ధానికి అనర్హం అని భారత ఆర్మీ నిరూపించింది. బంగ్లాదేశ్‌కు స్వాతం త్య్రం అందించిన 1971 యుద్ధంలో భారత సైన్యం వేలాది కండోమ్‌లను ఉపమోగించి పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. 

1971 యుద్ధానికి కారణం

తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)లోని ప్రజలపై పశ్చిమ పాకిస్థాన్(పాకిస్థాన్) ఆగడాలు ఎక్కువకావడంతో తమకు స్వాతం త్య్రం కావాలని తూర్పు పాకిస్థాన్ ప్రజలు  కోరుకున్నారు. ప్రజలపై పాకిస్థాన్ దాడులు చేస్తుండడంతో షేక్ ముజిబూర్ రెహమాన్   భారత సాయం కోరారు. దీంతో ఇండియన్ ఆర్మీ  రంగంలోకి దిగింది. 

కండోమ్‌లు ఉపయోగించి .. 

ప్రజల తిరుగుబాటును అణిచివేయడాని కి, భారత సైన్యాన్ని అడ్డుకోవడానికి చిట్టగాం గ్ పోర్ట్‌కు ఓడల ద్వారా ఆయుధాలను రవా ణా చేయడం పాకిస్థాన్ ప్రారంభించింది. దీంతో పాక్ ఆర్మీని కట్టడి చేయడానికి చిట్టగాంగ్ పోర్టుకు జరుగుతున్న ఆయుధాల రవాణాను అడ్డుకోవడానికి భారత నౌకాదళం మందుగుండు సామాగ్రిని పాక్ ఓడల కింద అమర్చి వాటిని పేల్చాలని నిర్ణయిం చింది.  ఓడలను పేల్చడానికి ఉపయోగించే ‘లింపెట్‌మైన్’ అనే మందుగుండు సామాగ్రి నీటిలో కేవలం 30 నిమిషాల్లో పేలే అవకాశం ఉండడంతో కండోమ్‌లను ఉపయో గించాలని నిర్ణయించింది. దీంతో వేలాది కండోమ్‌లను ఆర్డర్ చేసింది. లింపెట్‌మైన్ ను ఆ కండోమ్‌లలో అమర్చి పాక్ ఓడలను పేల్చేసింది. దీంతో చిట్టగాంగ్‌కు ఆయుధాల రవాణా నిలిచిపోయింది. భారత నౌకా దళం తీసుకున్న ఈ నిర్ణయం 1971 యుద్ధంలో పాక్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.