15 July, 2026 | 4:28 AM

ఆఫ్ఘాన్‌లో భారత కార్యాలయంపై దాడి

25-12-2024 02:34 AM
  • ముగ్గరు మృతి, ఒకరికి గాయాలు
  • భారతీయులకు ఎటువంటి హానీ జరగలేదని ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. జలాలా బాద్‌లో ఉన్న భారత కాన్సులేట్‌పై మంగళవారం కొందరు తుపాకులతో దాడులకు తెగబడటంతో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో భారతీయలు ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని భారత ప్రభు త్వ వర్గాలు వెల్లడించాయి.

ఆఫ్ఘాన్‌లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రభు త్వం ప్రకటన ద్వారా తెలిపింది. ఘటనలో ఆ దేశానికి చెందిన పౌరులే ప్రభావిత మైనట్టు పేర్కొంది. కాగా భారత ప్రభుత్వం 2020 నుంచి జలాలాబాద్‌లో కార్యకలపాలను నిలిపివేసింది. అయినప్పటి కీ స్థానిక ఆఫ్ఘన్ సిబ్బంది మాత్రం కార్యాల య నిర్వహణ సంబంధ విధులు నిర్వరిస్తున్నారు.