26 August, 2026 | 1:57 PM

డెంగ్యూ లెక్కలపై గోప్యత

12-06-2024 12:25 AM

గ్రేటర్‌లో నమోదవుతున్న డెంగ్యూ కేసులు

వివరాలు వెల్లడించని అధికారులు 

దోమల నివారణకు 642 బృందాలతో చర్యలు 

యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చర్యలు

గ్రేటర్‌లోని 30 సర్కిళ్ల పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టిన ఎంటమాలజీ విభాగం 

వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో సమయంలోనే నగరంలో డెంగ్యూ కలకలం రేపుతుందా. నగరంలోని దోమ కాటు కారణంగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయా అంటే సమాధా నం అవుననే వస్తుంది. నగరంలో నెల రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నివా సాలతో పాటు పలు ప్రాంతాల్లో నీరు నిల్వ కారణంగా దోమలు వ్యాపించి డెంగ్యూ కేసులు నమోదువుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తు న్నారు. డెంగ్యూ వ్యాధి మరింత విస్తరించకుండా గ్రేటర్ వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టిన ఎంటమాలజీ అధికారులు కార్యచరణకు సిద్దమయ్యారు. 

- హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1౧ (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల వర్షాలు దంచి కొడుతున్న కారణంగా అత్యధిక ప్రాంతాల్లో రహదారులు, నివాస ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తుంది. నీరు నిలిచే ప్రాంతాలలోనే దోమల ఉత్పత్తి జరుగుతు న్న నేపథ్యంలో దోమ కాటు కారణంగా నగర వాసులు డెంగ్యూ వ్యాధికి గుర వుతున్నారు.

జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్‌లో చాంద్రాయణ గుట్ట, మలక్‌పేట, ఫలక్‌నూమా, కూకట్‌పల్లి జోన్‌లో కూకట్‌పల్లి, గాజులరామారం, సికింద్రాబాద్ జోన్‌లో బేగంపేట, అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ జోన్‌లో ఖైరతాబాద్, మెహిదీపట్నం, కార్వా న్, ఎల్‌బీనగర్ జోన్‌లోని కాప్రా ప్రాంతాల లో ఈ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులు నమోదు వివరాలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శాఖకు చెందిన అధికారుల వద్ద జీహెచ్‌ఎంసీ అధికారుల వద్ద ఉన్న గణాంకాలు ఒకేలా ఉండటం లేదని తెలుస్తుంది. అంతే కాకుండా, డెంగ్యూ వివరాలను మరెవ్వరికీ చెప్పొందంటూ ఉన్నతా ధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నట్టు గా స్పష్టమవుతోంది. ఏది, ఏమైనా జీహెచ్ ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు గ్రేటర్‌లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.  

బల్దియాలో ఇంటింటి సర్వే..

వానాకాలంలో కురిసే నేపథ్యంలో ప్రజ లు దోమకాటుకు బలై డెంగ్యూ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండటంతో జీహెచ్‌ఎంసీకి చెంది న ఎంటమాలజీ విభాగం అధికారులు ముందుగానే ఇంటింటి సర్వే చేపట్టారు. దోమల ఉత్పత్తికి ప్రధాన  కారకాలైన నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించేలా ఈ సర్వే చేపట్టారు. ఈ మేరకు గ్రేటర్‌లోని 30 సర్కిళ్ల పరిధిలో చెరువులు, మూసి రివర్, ఇంటింటి సర్వే పద్దతి లో ఈ సర్వే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 3874 సెల్లార్లు, 12,872 తాళం వేసి ఇండ్లు, 5289 ఓపెన్ ప్లాట్లు, 748 ఫంక్షన్ హాళ్లు, 628లో లేయింగ్ ప్రాంతాలు, 3236 స్కూల్స్, 54 60 భవన నిర్మాణం జరుగుతున్న సైట్స్‌ను, 4846 కాలనీలు ఉన్నట్టుగా ఎంటమాలజీ విభాగం గుర్తించింది.

ఈ ప్రాంతాలలో నీరు నిల్వ కారణంగా దోమలు ఉత్పత్తి జరిగి డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని, అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ పరిధి లో ఏర్పాటు చేసిన 642 బృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ బృందంలో ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యులుగా ఉండనున్నారు. గ్రేటర్‌లోని 2460 మంది ఎంటమాలజీ విభాగం సిబ్బంది నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించడంతో పాటు యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చర్యలు చేపడుతున్నారు. 

నీళ్ల స్టోరేజ్‌ని శుభ్రం చేసుకోవాలి 

ఇండ్లల్లో వారానికోసారి నీళ్ల స్టోరేజీని శుభ్రం చేసుకోవాలి. డ్రమ్ములను శుభ్రం చేసే సమయంలో గుడ్డ పెట్టి తుడవాలి. వీటిపై కచ్చితంగా మూత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా జ్వరం రాగానే ఎలాంటి కంగా రు పడకుండా తక్షణమే చిటికెడు ఉప్పు, పంచదార నీళ్లల్లో కలుపుకుని తాగితే సరిపోతుంది. ఈ కారణంగా రక్తంలోని రక్తకణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) పెరుగుతుంది. ఇళ్లల్లో ఉండే డ్రమ్ములు, టైర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే లా చూసుకోవాలి.

జ్వరం రాగానే స్థానికంగా ఉండే బస్తీ దవాఖాన, పిహెచ్‌సీ లలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇది వైరల్ డిసీజ్ కావడం చేత మొదటి దశలోనే తగ్గించుకోవడానికి అన్ని రకా ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎక్స్, మై జీహెచ్‌ఎంసీ యాప్, టోల్ ఫ్రీ నంబరుకు వచ్చే కాల్స్ తదితర ఫిర్యాదులను 24 గంట ల్లో పరిష్కరిస్తున్నాం. ప్రతి శుక్రవారం స్కూల్స్‌లో దోమల నివారణకు చర్యలు తీసకుంటున్నాం. గ్రేటర్‌లోని 180 చెరువులలో ఆయిల్ బాల్స్, గంబూష్యా చేపల ద్వారా దోమల నివారణకు చర్య లు తీసుకుంటున్నాం. 

 రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్ట్