26 August, 2026 | 3:03 PM

వర్షాలపై అధికారులతో సీఎస్ సమీక్ష

11-06-2024 10:35 PM

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, విపత్తులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ డిజిస్టార్ రెస్పాన్స్ బృందాలను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలని, నగ రంలో కురిసే భారీ వర్షాలు, విపత్తులను ఎదుర్కో వడానికి పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలంటూ ఆమె అధికారులకు సూచించారు. సచివాల యంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ ఇంచా ర్జ్ కమిషనర్ ఆమ్రపాలి, ఈవిడిఎం డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి తది తర గ్రేటర్ అధికారు ల సమావేశంలో సీఎం వరదలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. ఈ సంద ర్భంగా సీఎస్ శాంతికుమారి మాటా ్లడుతూ భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థ వంతంగా ఎదుర్కొని పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ డిజిస్టార్ రెన్సాన్స్ బృందాలను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఓఆర్‌ఆర్ దాకా ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఉన్నట్టు తెలిపారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో 30 డిఆర్‌ఎఫ్ బృందాలు ఉండగా, నూతనంగా మరో 15 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీ లు ఉన్నందున కెమికల్ ఫైర్ ప్రివెన్షన్‌కు ప్రత్యేక శిక్షణ తో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. నగర వ్యాప్తంగా మున్సిపల్, పోలీ స్, విద్యుత్, జల మండలి సంబంధిత శాఖల సమన్వయంతో 141 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డిఆర్‌ఎఫ్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్‌డిఆర్‌ఎఫ్ విభాగంతో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. దేశంలోని ప్రధాన మహానగరాలైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు లలో డిజిస్టార్ రెస్పాన్స్ బృందాల పనితీరుపై ప్రత్యేక అధ్యయనం చేయాలని ఆదేశించారు.